ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యంగ్‌ హీరో | Ram Next movie with praveen sattaru | Sakshi
Sakshi News home page

Feb 10 2018 2:16 PM | Updated on Feb 10 2018 2:16 PM

Hero Ram - Sakshi

హీరో రామ్‌

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన పీయస్‌వీ గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల నితిన్ హీరో ప్రవీణ్ సత్తారు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే ఇప్పుడు మరో యంగ్ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్‌ హీరోగా ప్రవీణ్ సినిమా తెరకెక్కించనున్నాడట.

రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం‍లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సినిమా మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట రామ్‌. భవ్యక్రియేషన్‌ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రటన వెలుడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement