నువ్వు మూర్ఖుడివి: టాప్‌ డైరెక్టర్‌కు తిట్లు | Ram Gopal Verma faces severe backlash for posting inappropriate photo of Sania Mirza on Instagram | Sakshi
Sakshi News home page

నువ్వు మూర్ఖుడివి: టాప్‌ డైరెక్టర్‌కు తిట్లు

Jun 14 2017 2:17 PM | Updated on Sep 5 2017 1:37 PM

నువ్వు మూర్ఖుడివి: టాప్‌ డైరెక్టర్‌కు తిట్లు

నువ్వు మూర్ఖుడివి: టాప్‌ డైరెక్టర్‌కు తిట్లు

అగ్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

ముంబై: అగ్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మిర్జా అభ్యంతకర ఫొటో షేర్‌ చేసి, ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రూపొందించిన ‘మేరీ బేటీ సన్నీ లియోన్‌ బన్‌నా చాహ్‌తీ హై’ ఈ లఘుచిత్రం గురించి చెబుతూ సానియా ఫొటో పెట్టి కామెంట్లు చేశారు.

టెన్నిస్‌ ఆడుతుండగా తీసిన ఫొటోను పోస్ట్‌ చేసి వర్మ.. గతంలో సానియా చెప్పిన విషయాలను కామెంట్లుగా పెట్టారు. స్కార్టులు వేసుకుని టెన్నిస్‌ ఆడడానికి తన తండ్రి నిరాకరించాడని సానియా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తనకు నచ్చినట్టు జీవించాలను అమ్మాయి గురించి లఘుచిత్రంలో చూపించడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. ఇది షేర్‌ చేసిన సెకన్లలోనే నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కొంతమంది వర్మకు మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమివుందని ప్రశ్నించారు. వర్మ వ్యాఖ్యలను విశాలదృక్పథంతో చూడాలన్నారు.

నెటిజన్లు చేసిన కామెంట్లలో కొన్ని..
భారతీయుల్లా పాకిస్తానీయులు ఊరుకోరు. తన భార్య ఫొటో పెట్టినందుకు షోయబ్‌ మాలిక్‌ వచ్చి మిమ్మల్ని దండిస్తాడు.
మీరు మంచి ఫిల్మ్‌మేకర్‌ కానీ తండ్రిగా, మనిషిగా మీరెలాంటివారోనన్న అనుమానం కలుగుతోంది.
వర్మ గురించి తెలిసి కూడా అమితాబ్‌ బచ్చన్‌ వంటి అగ్రనటులు ఆయనతో ఎందుకు పనిచేస్తారో?
నువ్వు మూర్ఖుడివి, పిచ్చిచేష్టలు మానుకో.
వర్మ మైండ్‌సెట్ అవమానకరం, మీ పరువు మీరే దిగజార్చుకుంటున్నారు.
వర్మ చచ్చిపోవాలి.. అతడి ఆలోచనలు వికృతంగా ఉన్నాయి.
మీ సోదరి, కూతురికి సంబంధించిన ఇలాంటి ఫొటోలు పెడతారా?
ఇండియాకు ప్రతిభ ఉన్న దర్శకుడు కావాలి కానీ వివాదస్పద వ్యక్తి కాదు
ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ తప్ప మరోటి కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement