చచ్చిపోవాలనిపిస్తోంది: ఆర్జీవీ | Ram Gopal Varma Sys I Feel Like just kill myself | Sakshi
Sakshi News home page

Feb 27 2018 9:19 AM | Updated on Feb 27 2018 9:24 AM

Ram Gopal Varma Sys I Feel Like just kill myself - Sakshi

రాంగోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణం ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రాంగోపాల్‌ వర్మను ఎంత కుదిపేసిందో చెప్పనక్కర్లేదు. ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ఆయన ట్వీట్ల పర్వం ఆదివారం వరకు కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్‌​ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఆ తర్వాత మూగబోయాడు. 

అయితే ఆయన స్పప్నసుందరి మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడం, ఫొరెన్సిక్‌ రిపోర్ట్‌లో ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని వార్తలు రావడం వర్మను తీవ్రంగా కలిచి వేశాయి. ఆమె అందం గురించి మాట్లాడుకునే జనాలు ఇప్పుడు ఆమె ఎలా చనిపోయిందో మాట్లాడుకుంటున్నారని సోషల్‌మీడియా వేదికగా వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మరోసారి  ట్వీట్ల పర్వం మొదలెట్టాడు.  

‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంద’ని వర్మ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్‌లో తాను తెరకెక్కించన ’గోవిందా గోవిందా’ సినిమాలోని అమ్మ బ్రహ్మదేవుడో పాటను షేర్‌ చేస్తూ.. ‘ నేను ఈ పాటను కేవలం ఆమె అందం వర్ణించడం కోసం తీసాను. ఇంత అందమైన అమ్మాయి ఇలా చనిపోవడం సబబేనా?’ అని ప్రశ్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement