'ఆ హిట్ సినిమాల స్క్రిప్ట్ లేదు' | Sakshi
Sakshi News home page

'ఆ హిట్ సినిమాల స్క్రిప్ట్ లేదు'

Published Tue, Aug 22 2017 1:18 PM

'ఆ హిట్ సినిమాల స్క్రిప్ట్ లేదు'

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్క్ స్టేట్ మెంట్ తో ఆకట్టుకున్నాడు. ప్రముఖ్య బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమా చోప్రా కు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నిర్మాత విధూ వినోద్ చోప్రా భార్య అయిన అనుపమా.. ' అనుపమా ఫిల్మ్ కంపానియన్' పేరుతో ఓ వెబ్ సైట్ ను నడుపుతోంది. ఇటీవల ఈమె వర్మను సాయం కోరింది.

వర్మ తెరకెక్కించిన క్లాసిక్స్ సత్య, కంపెనీ సినిమాల స్క్రిప్ట్ లు ఇస్తే తన వెబ్ సైట్ లో పెడతానని అవి సినీ రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఉపయోగకరంగా ఉంటాయని అడిగింది. అయితే అనుపమ అభ్యర్థన పై వర్మ తనదైన స్టైల్ లో స్పందించాడు. ఆ రెండు సినిమాలు తాను స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించానన్న వర్మ, ఎప్పటి నుంచైతే తాను బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు చేయటం మొదలు పెట్టానో అప్పుడే తనకు ఫ్లాప్ లు మొదలయ్యాయని తెలిపాడు.

అంతేకాదు విషయాన్ని వర్మ తన తల్లి మీద తనకు నచ్చిన దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్  మీద ఒట్టేసి చెబుతానన్నాడు. వర్మ ఆన్సర్ తో షాకైన అనుపమా ఇది వర్మ మార్కు క్లాసిక్ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement