స్పందించిన వర్మ.. పవన్‌కు సుదీర్ఘ లేఖ

Ram Gopal Varma Reacts On Pawan kalyan Issue - Sakshi

నటుడు పవన్ కల్యాణ్‌తో వివాదంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్‌పై ఇకనుంచి నెగటివ్ కామెంట్లు చేయనని తన తల్లిపై ఒట్టేశానని చెప్పిన వర్మ.. ఆపై పవన్ చేసిన ట్వీట్లకు తాను లాజికల్‌గా సమాధానం ఇవ్వాల్సి ఉందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే.. ప్రాస్టిట్యూషన్‌ను చట్టబద్ధం చేయడం మీకు ముఖ్యమైందా అని పవన్ అడుగుతున్నారు. కానీ ప్రత్యేక హోదా కంటే మీకు ఎవరో వ్యక్తి తిట్టారన్న విషయమే జాతీయ సమస్యగా కనిపించిందా అని తన పోస్ట్‌లో ప్రశ్నించాడు.

హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజే మీరు ఇలా నిరసన తెలపడం సమంజసమా అని లాజికల్‌గా పవన్‌ను అడుగుతున్నట్లు వర్మ తెలిపారు. పవన్ తల్లిని తిట్టించడానికి తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్న వర్మ.. ఈ వివరాలు తాను విడుదల చేసిన వీడియోలో క్లియర్‌గా ఉన్నాయంటూ కొన్ని విషయాలు డైరెక్టర్ వర్మ పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు శుక్రవారం కొన్ని గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు జరిపిన అనంతరం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని అంతలోపు తనకు న్యాయం చేయాలని సినీ పెద్దలను పవన్ కోరిన విషయం తెలిసిందే.

పవన్‌కు దర్శకుడు వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన లేఖ యథాతథంగా... 
పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు
నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్  గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ  తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్  గా కాకుండా ,లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం  వచ్చింది.

పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి 
“మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు  ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9  ABN ANDHRA JYOTHI ద్వారా నా  మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు  ఖర్చు పెట్టి నాకు   సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు  తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో  పెట్టారు..Ram gopal Varma,Tv 9 owner srini raju ,Ravi Prakash ,Lokesh Naidu ,అతని  ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా

RGV: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన  కాన్స్పిరసీ థియరీ చదవలేదు.. ఇప్పుడు  మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ  అనను.  మీడియాలో మీటింగ్లు  బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి  తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు..మీరన్న దానికి  పాయింట్లు గా నా వివరణ ఇస్తాను 

1.సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్  చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది 

2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి  క్యారెక్టర్ గురించి తెలపటానికి 

3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన  సత్యం.. మహేష్  కత్తి example ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను ..ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో  ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు... ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా  ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను   

4.ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్ కాదు.. ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం.. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా  వాడే  పదం.. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే  ల  కొడుకు అనే  పదం 

5.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే  తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు  

6.ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి  5 కోట్లు  ఇఛ్చి తిట్టించమనుకుందాం.. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం  వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది.. మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా?, మీ  క్రెడిబిలిటీ తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు  తగ్గిపోతాయా? 

7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లుగల వారెవరూ లేరు.. ఇది కేవలం నా ఒక్కడి  తప్పే  అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ  క్షమాపణ చెప్పుకుంటున్నాను 

PK: ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు." 

RGV: కళ్యాణ్ గారు, హీరో  అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం  మీకు తగదు.. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు  ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ  చేయబోయే మీరు.. ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ  మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం.

పవన్ కళ్యాణ్ గారు వేసిన కొన్ని ఇంగ్లీష్  ట్వీట్లు 
PK:  Hon C M For these channels, legalisation of prostitutes are more important than special status ..what is your priority as you control the media? 

RGV: I am shocked that you are calling all the unfortunate girls who are victims of casting couch and male abused as prostitutes..this is far worse than what Sri reddy said ..You mean to say just because he is close to your family , all the women whoever complained about the atrocities on your man Vaakadu Apparao are prostitutes ? Never heard anything more deameaning to women.

PK: Interesting fact ,The current dream team also has mothers,sisters and daughters..But their women are secured and safe but my poor fragile 70 year old mother had to be abused for TRPs and political benifits 

RGV: What’s more interesting is I don’t understand how TRPs and political benifits can come to your opponents because of abuses? .. Do you mean to say that tv viewers and voters want to listen to mothers being abused ? Is that how bad you think of telugu people? 
If at all there’s any political benefit in this whole issue ,it’s only for you because you are dragging your mother into this to gain sympathy which might convert to votes
And with regard to the so called dream team’s mothers,sisters and daughters you can always unleash many of ur fans in the social media and you very well know that no one  in the world can match their exemplary language skills..in comparison to their abuses what Sri reddy said will sound like a pure morning prayer

-your ardent fan RAM GOPAL VARMA

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top