Pawan Kalyan
-
ఏపీలో ఉచితం వంకతో వీర బాదుడు.. ఒక్క గ్యాస్ సిలిండర్ భారమే 14వేల కోట్లు!!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.తాజాగా పోతిన మహేష్ ట్విట్టర్లో వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP @JanaSenaParty@BJP4India దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు… pic.twitter.com/n44gAeFrCz— Pothina venkata mahesh (@pvmaheshbza) October 31, 2024 -
జంతువుల కొవ్వుతో ఆయిల్ పవన్ ఇలాకాలో కల్తీ దందా
-
3 క్వార్టర్లు, 6 ఫుల్లుల్లా కూటమి మద్యం దందా
-
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
‘చంద్రబాబూ.. పిల్లలతో మద్యం అమ్మించడం భావ్యమేనా?’
విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఈ వీడియో చూడండి. ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో. చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు. చంద్రబాబుకి ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ..ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచేమార్గాల్లో, చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం?. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. పిల్లలని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు.జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే..చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు..ఈ వీడియో చూడండి...ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో..చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు..ఇది ఎక్కడో కాదు..చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ లోనే… pic.twitter.com/8UG1ZGT3lK— Roja Selvamani (@RojaSelvamaniRK) October 28, 2024 చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి -
పవన్‌కళ్యాణ్‌పై టీడీపీ నేత ఫైర్
ఏలూరు రూరల్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్నారా లేదా అన్నది స్పష్టంచేయాలని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామ టీడీపీ నేత సైదు గోవర్థన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో.. పవన్‌కళ్యాణ్ కొల్లేరును సర్వనాశనం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తూ.. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడిగా తనకు ఇలా అడిగే హక్కుందన్నారు. ఇటీవల జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు గ్రామాల్లోని వైఎస్సార్సీపీ నాయకులను వారి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతూ.. దొంగలను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే ఎక్కడ దాక్కున్నారని అసభ్య పదజాలంతో దూషించారు. జనసేన నాయకుల కారణంగా కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి పనితీరును అడ్డుకుంటానని గోవర్థన్ హెచ్చరించారు. ఈ వీడియో కొల్లేరు గ్రామాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్.. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు: ప్రకాష్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ తీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పవన్ చేస్తున్న పాలిటిక్స్‌పై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ చేస్తున్న రాజకీయంపై ఆయన పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అంటే మీకెందుకు అంత కోపం? అని అడగ్గా.. పవన్ కల్యాణ్ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అది మాత్రమే చెబుతున్నాను. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి పాలిటిక్స్ కోసం కాదు కదా? ప్రజల తరుపున పవన్‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా! మతం పేరుతో రాజకీయం చేసి అయోధ్యలో (బీజేపీ) ఓడిపోయారు. ఇప్పుడు మన కొండ ఎక్కడానికి వచ్చారు. మత తత్వ రాజకీయాలు మన దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదు' అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పనిచేస్తూనే ఉన్నాను ఎవరైనా ఆపగలరా అని అన్నాడు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని.. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని ప్రకాష్ రాజ్ బలంగా చెప్పారు.(ఇదీ చదవండి: వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?) -
ఇంగితజ్ఞానం లేదా పవన్ కళ్యాణ్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
-
నమ్మించి మోసం చేసిన కూటమి కరెంటు బిల్లులు బాదుడే బాదుడు..
-
సనాతన ధర్మం గురించి నాతో చర్చించే దమ్ముందా..?
-
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్‌ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్‌లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
ఈసారి అమ్మ, చెల్లి ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు వైఎస్ జగన్. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ గుర్లలో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారు. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?. ఈనాడు, ఏబీఎన్, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలి. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?. ఇలాంటివి ప్రతీ ఇంట్లోనూ ఉండే విషయాలే. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు పలికారు. ఇదే సమయంలో విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. డయేరియాతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు. -
లైవ్ లో పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తూ పరువు తీసిన జడ శ్రవణ్..
-
చంద్రబాబూ.. మీ పాలనలో ఇంకెంతమంది బలి కావాలి?: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: గత నాలుగు నెలల నుంచి ఏపీలో అత్యంత భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయంటూ కూటమి ప్రభుత్వంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని ధ్వజమెత్తారు.‘‘కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కూడా అమ్మాయిలను టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నట్లున్నారు. మొన్న తిరువూరు, సత్యవేడు ఘటనలు చూస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. పరిపాలన ఎలా చేయాలో కాకుండా ఆడవాళ్లకు ఎలా మెసేజ్‌లు పెట్టాలి, ఆడవాళ్లను ఎలా రూములకు పిలిపించుకోవాలని అనే అంశాల్లో బాగా బిజీగా ఉన్నట్లున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడితే.. దగ్గరుండి రాజీ చేయించారు. మీ రాజ్యంలో అత్యాచారం చేస్తే అడిగేవాడే లేదు.. మర్డర్ చేస్తే మాట్లాడేవాడు లేడు. చంద్రన్నరాజ్యం అని చెప్పుకుంటూ సీఎం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు’’ అంటూ శ్రవణ్ నిప్పులు చెరిగారు.‘‘జనసేన కార్యకర్తలు, నాయకులు దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రండి. ఈ రాష్ట్రంలో మహిళలపై మీ నాయకుడు అప్పుడేం మాట్లాడాడో.. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం గడ్డిపీకుతున్నాడో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చిద్దాం రండి. అధికారంలో లేనప్పుడు.. ఉప ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీ సచ్ఛీలత ఏంటో ప్రజల ముందు నిరూపిద్దాం. కుప్పం నియోకవర్గంలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఉమెన్ మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అన్ని కేసులు నమోదైతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా?. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ లేదు.. ఉద్యోగాలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా అని సందేహం కలుగుతోంది’’ అంటూ శ్రవణ్ దుయ్యబట్టారు. -
బాబూ నీ పాలన ఇలానే ఉంటే ఇక తిరుగుబాటే
-
పవన్ కళ్యాణ్ పై మాడుగుల వేణుగోపాలరెడ్డి ఆగ్రహం
-
డయేరియా మరణాలు.. పవన్ పై YSRCP నేత ఫైర్
-
జనసేన నేతల వేధింపులు.. మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే ఓ శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగిని సునితని జనసేన నాయకులు వేధింపులకు గురి చేశారు. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీలు నడకుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త వీరబాబు ఆరోపించారు. నిందితులు తన భార్యను నెలకు రూ.20 వేల లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇవ్వలేదంటే లైగింక కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?. ..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు. -
ఇలా చేస్తున్నావేంటి పవన్?.. ఉద్యోగుల బైఠాయింపు
సాక్షి, విజయవాడ: వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినా పట్టించుకోరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిన్నటి(సోమవారం) నుంచి పవన్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పవన్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు.పవన్ కలవడం కోసం కటిక నేల మీదే కూర్చొని నిన్నంతా మహిళ ఉద్యోగులు కష్టాలు పడ్డారు. వినతిపత్రం ఇవ్వడానికి ఉద్యోగులు రాగా, పవన్ వారిని కలకుండా వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కలవరు.. వెళ్ళిపొమంటూ సిబ్బంది చెప్పారు. నిన్నంతా జనసేన ఆఫీసే దగ్గరే మహిళా ఉద్యోగులు ఉన్నారు. పవన్‌ను కలిసేంత వరకు వెళ్లబోమంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జనసేన ఆఫీస్ దగ్గరే బైఠాయించారు.పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చమరోవైపు, పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చ సాగుతోంది. ‘పల్లె పండుగ’ సాక్షిగా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. దళిత సర్పంచ్‌లకు విలువ ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవఖండ్రవాడ పల్లె పండుగలో ఇరుపార్టీల నేతల మధ్య రగడ నెలకొంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించని శ్రీనివాస్‌ను తక్షణమే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని.. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.ఇదీ చదవండి: పచ్చపార్టీలో కొత్త చిచ్చు -
వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలం
-
పవన్ కళ్యాణ్ తిక్క కుదిరింది తిరుమల లడ్డుపై కోర్టు నోటీసులు..
-
పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానం
గుర్ల: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయింది. డయేరియాతో పది మంది చనిపోయినా ఒక్కరే అంటూ చేసిన ప్రకటన తప్పని తేలింది. ఇప్పటికే డయేరియా మరణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. జిల్లా కలెక్టర్ డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డయేరియా కారణంగా ఒకరు మృతి చెందారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ చేసిన ప్రకటనలు తప్పని తేల్చారు. గుర్లలో 10 మంది డయేరియా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఇస్తామని పవన్ ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి, కలెక్టర్ అవాక్కయ్యారు. ఒక్కరే చనిపోయారంటూ కలెక్టర్ ప్రకటించి మృతుల సంఖ్యను దాచి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పదిమంది చనిపోయారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లికి అవమానంమరోవైపు గుర్లలో పవన్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కి ఘోర అవమానం జరిగింది. గుర్ల పీహెచ్సీలో డయేరియా రోగులను పరామర్శించడానికి పవన్‌తో పాటు వెళ్లేందుకు మంత్రి కొండపల్లిని పవన్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో పవన్ ఆస్పత్రిలో వున్నంత సేపు కొండపల్లి మెయిన్ డోర్ బయటే నిలబడడ్డారు. దీంతో పవన్ తీరుపై జిల్లా టీడీపీలో చర్చ జరుగుతుండగా.. తమ మంత్రినే అవమానిస్తారా’ అంటూ కొండపల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.