ఏలూరులో విషాదం.. స్కూటీపై క్రాకర్స్‌ తీసుకెళ్తుండగా పేలుడు.. | Crackers Explosion And Person Dead At Eluru District | Sakshi
Sakshi News home page

ఏలూరులో విషాదం.. స్కూటీపై క్రాకర్స్‌ తీసుకెళ్తుండగా పేలుడు..

Oct 31 2024 2:24 PM | Updated on Oct 31 2024 3:07 PM

Crackers Explosion And Person Dead At Eluru District

సాక్షి, ఏలూరు: దీపావళి పండుగ వేళ ఏలూరు విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై బాణాసంచా తరలిస్తుండగా అవి ఆకస్మాత్తుగా పేలడంతో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, స్థానికంగా విషాదకర ఛాయలు అలుముకున్నాయి.

వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలో తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచా తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇ‍ద్దరిలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న మరికొందరు గాయపడ్డారు. ఇక, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
 

Advertisement
 
Advertisement
Advertisement