దసరాకి విధేయ రాముడు! | Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

దసరాకి విధేయ రాముడు!

Oct 8 2018 2:18 AM | Updated on Oct 8 2018 4:32 AM

Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama - Sakshi

రామ్‌చరణ్‌

అజర్‌బైజాన్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత రామ్‌చరణ్‌ తాజా సినిమా టైటిల్‌ ప్రకటన ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సినిమా టైటిల్‌ గురించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ‘వినయ విధేయ రామ, విజయ విధేయ రామ’ అనే టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను నిర్మాత డీవీవీ దానయ్య ఫిల్మ్‌ చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారని లేటెస్ట్‌ టాక్‌. దీంతో ఈ టైటిలే ఫైనల్‌ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు ముగ్గురు బ్రదర్స్‌ ఉంటారని వార్తలు వచ్చాయి.

సో.. ‘వినయ విధేయ రామ’ టైటిల్‌ ఫిక్స్‌ అంటున్నారు చరణ్‌ అభిమానులు. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఈ దసరా పండక్కి ఉండే అవకాశం ఉందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్‌ రాజేష్, స్నేహ, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్నారట చిత్రవర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement