లవ్‌ యూ అమ్మ: రామ్‌ చరణ్‌

Ram Charan Birthday Wishes To Her Mother Surekha With Emotional Message - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ తన తల్లికి సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డ్‌ విషెస్‌ తెలిపారు. ‘నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. లవ్‌ యూ అమ్మ’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తల్లితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అదేవిధంగా ఉపాసన కొణిదెల కూడా తన అత్తకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అత్తమ్మ. లవ్‌ యూ’అని పేర్కొంటు అత్త సురేఖ, భర్త రామ్‌ చరణ్‌తో దిగిన ఫోటోను మెగా అభిమానులతో పంచుకున్నారు. ఇక తన బర్త్‌డే వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్‌గా తన కుటుంబ సభ్యులతో చేసుకోవడం ఇష్టమని సురేఖ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 

ఇక మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జులైలో విడుదల కావాల్సినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పాత్ర కూడా ఈ మెగా పవర్‌స్టార్‌ పోషిస్తున్నట్లు సమాచారం. 
 


Happy birthday to my first love!! Love you Mom!! 😍🥳

A post shared by Ram Charan (@alwaysramcharan) on


Happy birthday Athama. ❤️❤️❤️ Love u.

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

చదవండి:
చూపులు కలవని శుభవేళ

మణిశర్మ, తమన్‌.. ఇప్పుడు అనిరుద్‌?

నాది చాలా బోరింగ్‌ లైఫ్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top