
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనున్న సినిమా శుక్రవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మాత. చరణ్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు చరణ్ హీరోగా ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ చిత్రాలను నిర్మించారాయన. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనూ, రామ్‌చరణ్‌తోనూ బోయపాటికి మొదటి చిత్రమిది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతుందని సమాచారమ్! ఈలోపు కథకు తుది మెరుగులు అద్దడంతో పాటు మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బోయపాటి శ్రీను బిజీ అవుతారట! ఈ సిన్మాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారమ్! ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు చరణ్. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలసి మల్టీస్టారర్ చేసే విషయమై చర్చలు కూడా జరుపుతున్నారట!!