సంక్రాంతికి.. | Ram Charan and Boyapati Srinu film in Sankranthi race | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి..

Jun 17 2018 1:10 AM | Updated on Jun 17 2018 1:10 AM

Ram Charan and Boyapati Srinu film in Sankranthi race - Sakshi

అరవైమంది ఆర్టిస్టులు... 500 మంది బాడీ బిల్డర్స్‌.. 5 కోట్ల ఫైట్‌లోకి హీరో రామ్‌చరణ్‌ దిగితే... ఇక చెప్పేది ఏముంది? విలన్స్‌కు ఊచకోతే. ఈ యాక్షన్‌ పండగ థియేటర్స్‌లోకి వచ్చేది సంక్రాంతి పండక్కే. అంటే.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రామ్‌చరణ్‌ రెడీ అన్నమాట. బోయపాటి శీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సీన్స్‌లో కియారా అద్వానీ కూడా పాల్గొంటున్నారు. నిర్మాత డీవీవీ. దానయ్య మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రీసెంట్‌గా బ్యాంకాంక్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. రామ్‌చరణ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్‌ చేస్తున్నారు బోయపాటి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ను జోడిస్తున్నాం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement