నేనైతే చంపేసుంటా! | Rakulprit Singh about sexual abuse | Sakshi
Sakshi News home page

నేనైతే చంపేసుంటా!

Feb 25 2017 10:49 AM | Updated on Aug 3 2019 1:14 PM

నేనైతే చంపేసుంటా! - Sakshi

నేనైతే చంపేసుంటా!

అలాంటి పరిస్థితి నాకు ఎదురై ఉంటే వారిని చంపేసేదాన్ని అంటోంది నటి రకుల్‌ప్రీతిసింగ్‌.

అలాంటి పరిస్థితి నాకు ఎదురై ఉంటే వారిని చంపేసేదాన్ని అంటోంది నటి రకుల్‌ప్రీతిసింగ్‌. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా అంటున్నారో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇటీవల నటి భావన ఎదుర్కొన్న లైంగికవేధింపుల సంఘటన చిత్ర వర్గాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఆమెపై లైంగికవేధింపులకు పాల్పడ్డ మృగాల్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సహ నటీమణులు డిమాండ్‌ చేస్తున్నారు.

భావనకు జరిగిన సంఘటన గురించి నటి రకుల్‌ప్రీతిసింగ్‌ స్పందిస్తూ తనకే అలాంటి పరిస్థితి ఎదురైతే వారిని అక్కడే చంపేసేదానినని అంది.  భావనకు జరిగిన సంఘటన తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని .. అది సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది. తాను షూటింగ్‌కు బయలుదేరే ముందు అమ్మ జాగ్రత్తగా వెళ్లిరా అని చెబుతుండేదని, కారు డ్రైవర్‌ తోడుండగా తనకు భయమేమిటని భావించేదానినని చెప్పింది. అలాంటి డ్రైవర్లే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అని పేర్కొంది.

మొదట్లో కోలీవుడ్‌లో నిరాదరణకు గురైన రకుల్‌ప్రీతిసింగ్‌ ఆనక టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి. విశాల్, కార్తీల సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడు నటుడు సూర్యతో రొమాన్స్  చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం సూర్య విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌తో కలిసి డ్యూయెట్లు పాడుతున్న విషయం తెలిసిందే. తదుపరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి రకుల్‌ప్రీతిసింగ్‌ నటించనున్నారు. డ్రీమ్‌ వారియర్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లో సెట్‌ పైకి రానుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement