
ఒక రకుల్... ఇద్దరు హీరోలు!
ఒక రాధ... ఇద్దరు కృష్ణులు అంటారు. ఇప్పుడు దీన్ని ఒక రకుల్.. ఇద్దరు హీరోలు అని మార్చాలి.
ఒక రాధ... ఇద్దరు కృష్ణులు అంటారు. ఇప్పుడు దీన్ని ఒక రకుల్.. ఇద్దరు హీరోలు అని మార్చాలి. ఎందుకంటే ఆమె కథానాయికగా నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఒకటి.. నాగచైతన్య సినిమా. మరోటి... సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’. ఈ రెండు చిత్రాల్లోనూ రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక కావడం విశేషం. వైజాగ్‌లో రకుల్ షిఫ్టులవారీగా ఈ రెండు చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారేమో. బిజీ బిజీగా షూటింగ్ చేస్తూనే ఆమె సరదాగా ఓ ఫొటో బయటపెట్టారు. అది నాగచైతన్యతో కలసి దిగిన ఫొటో. ఆ ఫొటోలో రకుల్ జస్ట్ కళ్లు మాత్రం చూపిస్తూ.. మిగతా ముఖాన్ని ముసుగులో దాచేశారు. పక్కనే నాగచైతన్య కూడా ఉన్నారు. ఇంతకీ రకుల్ ఇలా ముఖం దాచుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ దర్శకుడు కల్యాణ్ కృష్ణ.
ఈయన దర్శకత్వంలోనే నాగచైతన్య-రకుల్‌ల సినిమా తెరకెక్కుతోంది. ‘లుక్ బయటికి రాకూడదు’ అని దర్శకుడు కోరారట. అందుకే రకుల్ ముసుగు వేసుకున్నారు. ఇక.. వైజాగ్‌లో షూటింగ్ జరుపు కొంటున్న సాయిధరమ్ ‘విన్నర్’ విషయానికొస్తే.. ఈ చిత్రానికి గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తు న్నారు. అరకు అందాలను ఆస్వా దిస్తూ.. సాయిధరమ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘తెల్లవారుజాము షూటింగ్‌లో పాల్గొనడం భలేగా ఉంది’’ అంటూ ఓ ఫొటో ట్వీట్ చేశారీ యువ హీరో. అన్నట్లు... ఈరోజు అఖిల్ ఎంగేజ్‌మెంట్ కదా.. వైజాగ్‌లో షూటింగ్‌కి చిన్న బ్రేక్ చెప్పి, నాగచైతన్య హైదరాబాద్‌లో వాలిపోతారేమో!