సారీ సన్నీ!

Rakhi Sawant says sorry to Sunny Leone - Sakshi

రాఖీ సావంత్‌.. సన్నీ లియోన్‌. ఇద్దరూ ఇద్దరే. హాట్‌ గర్ల్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నంత హాట్‌గా ఉంటారు. సన్నీ హాట్‌ అయినా కూల్‌గా ఉంటారు. రాఖీ మాత్రం ఎప్పటికప్పుడు హాట్‌ స్టేట్‌మెంట్స్‌ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎవరినైనా విమర్శించేటప్పుడు చాలా ఘాటుగా మాట్లాడతారామె. ఆ మధ్య వరుసగా సన్నీ లియోన్‌పై అవాకులు చెవాకులు పేలారు రాఖీ. ‘‘సన్నీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి. తనలాంటి పోర్న్‌ స్టార్‌ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ చెడిపోతోంది. ఆమెను తక్షణమే బాలీవుడ్‌ నుంచి బహిష్కరించాలి.

ఆమె ఇండియాని, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని వదిలి వెళ్లిపోవాలి’’ అంటూ రాఖీ నోరు పారేసుకున్నారు. మరి.. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో.. ‘సారీ.. సన్నీ’ అన్నారు. ‘‘సన్నీ లియోన్‌ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడా. ఆమె గురించి నాకేం తెలుసని అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది పూర్తిగా నా తప్పే. ఆమె వ్యక్తిగత జీవితం, గత చరిత్ర నాకు అనవసరం. ఇప్పుడు ఆమె   ఏంటన్నది ముఖ్యం. ఓ భారతీయ పాపని దత్తత తీసుకోవడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సన్నీ మనస్తత్వం చాలా గొప్పది. ఆమె గురించి గతంలో అలా మట్లాడినందుకు సిగ్గు పడుతున్నా. ఇప్పుడు సన్నీకి సారీ చెబుతున్నా’’ అన్నారు రాఖీ సావంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top