breaking news
hot comments interview
-
సారీ సన్నీ!
రాఖీ సావంత్.. సన్నీ లియోన్. ఇద్దరూ ఇద్దరే. హాట్ గర్ల్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నంత హాట్‌గా ఉంటారు. సన్నీ హాట్ అయినా కూల్‌గా ఉంటారు. రాఖీ మాత్రం ఎప్పటికప్పుడు హాట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎవరినైనా విమర్శించేటప్పుడు చాలా ఘాటుగా మాట్లాడతారామె. ఆ మధ్య వరుసగా సన్నీ లియోన్‌పై అవాకులు చెవాకులు పేలారు రాఖీ. ‘‘సన్నీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి. తనలాంటి పోర్న్ స్టార్ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ చెడిపోతోంది. ఆమెను తక్షణమే బాలీవుడ్ నుంచి బహిష్కరించాలి. ఆమె ఇండియాని, బాలీవుడ్ చిత్ర పరిశ్రమని వదిలి వెళ్లిపోవాలి’’ అంటూ రాఖీ నోరు పారేసుకున్నారు. మరి.. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో.. ‘సారీ.. సన్నీ’ అన్నారు. ‘‘సన్నీ లియోన్ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడా. ఆమె గురించి నాకేం తెలుసని అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది పూర్తిగా నా తప్పే. ఆమె వ్యక్తిగత జీవితం, గత చరిత్ర నాకు అనవసరం. ఇప్పుడు ఆమె ఏంటన్నది ముఖ్యం. ఓ భారతీయ పాపని దత్తత తీసుకోవడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సన్నీ మనస్తత్వం చాలా గొప్పది. ఆమె గురించి గతంలో అలా మట్లాడినందుకు సిగ్గు పడుతున్నా. ఇప్పుడు సన్నీకి సారీ చెబుతున్నా’’ అన్నారు రాఖీ సావంత్. -
అమెరికాను ముస్లింలు ద్వేషిస్తారా?
లండన్: ‘ఇస్లాం మమ్మల్ని ద్వేషిస్తోంది’ అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న డొనాల్ట్ ట్రంప్ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అమెరికాను ద్వేషిస్తారంటూ మరో సందర్భంలో నొక్కి చెప్పారు. ఆయన చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉందా? నిజంగా ముస్లింలు అమెరికాను ద్వేషిస్తారా? ముస్లింలు మైనారిటీగా ఉన్న దేశాల్లో మాత్రమే ముస్లింలు అమెరికాను ద్వేషిస్తున్నారని, ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశాల్లో ముస్లింల వైఖరి పరస్పర భిన్నంగా ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేసిన సమయంలోనే మెజారిటీ ముస్లింలు అమెరికాను ద్వేషించారని, ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే ముస్లింలు అమెరికాను ద్వేషిస్తున్నారని ప్రపంచ ప్రజల వైఖరిపై సర్వే జరిపిన పియూస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఈజిప్టు, జోర్డాన్ లాంటి మధ్యప్రాచ్య దేశాల్లో మాత్రమే అమెరికా అంటే ద్వేషం ఉందని, మధ్యప్రాచ్యం మినహా మిగతా ముస్లిం దేశాల్లో అమెరికా అంటే సానుకూల వైఖరి ఉంది. అమెరికాను వ్యతిరేకిస్తున్న ముస్లిం దేశాల్లో కూడా అమెరికాను ఇస్లాం మతపరంగా ద్వేషించడం లేదు. అమెరికా విదేశాంగ వైఖరినిబట్టే అమెరికాను ద్వేషిస్తున్నారు. ప్రపంచంలోనే ముస్లింలు ఎక్కువగావున్న ఇండోనేషియాలో 62 శాతం ప్రజలు అమెరికాను సానుకూలంగా ఉన్నారు. 90 శాతం ముస్లింలు ఉన్న సెనెగల్ దేశంలో 80 శాతం మంది ముస్లింలు అమెరికాను సానుకూలంగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 160 కోట్ల ముంది ముస్లింలలో అమెరికా పట్ల సానుకూల వైఖరి పెరగుతూ వచ్చిందని పియూస్ రీసెర్చ్ సెంటర్ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఒబామాకు ముందు పాలస్తీనా ప్రాదేశిక ప్రాంతాల్లో 70 శాతం ముస్లిం ప్రజలు అమెరికాను ద్వేషించేవారు. వారిలో 80 శాతం మంది ఒబామా వచ్చాక సానుకూలంగా మారిపోయారు. పాకిస్తాన్లో మాత్రం అమెరికా అంటే 61 శాతం ప్రజలకు ప్రతికూల అభిప్రాయం ఉంది. 98 శాతం ముస్లింలు ఉన్న టర్కీ దేశంలో 36 శాతం మంది ప్రతికూలంగా, 36శాతం మంది అనుకూలంగా 28శాతం మంది తటస్థంగాఉన్నారు.