రజనీకాంత్ ఎందుకు వెళ్లడం లేదు? | Rajinikanth's Daughter Aishwaryaa Reveals Details Of United Nations Dance Recital | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ ఎందుకు వెళ్లడం లేదు?

Mar 6 2017 8:22 PM | Updated on Sep 5 2017 5:21 AM

రజనీకాంత్ ఎందుకు వెళ్లడం లేదు?

రజనీకాంత్ ఎందుకు వెళ్లడం లేదు?

ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తన కుమార్తె ఐశ్వర్య ఇవ్వనున్న నృత్య ప్రదర్శనను సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదట.

చెన్నై: ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తన కుమార్తె ఐశ్వర్య ఇవ్వనున్న నృత్య ప్రదర్శనను సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదట. ఆయనే కాదు ఐశ్వర్వ భర్త హీరో ధనుష్ కూడా ఆమె నృత్యాన్ని తిలకించడానికి వీలుపడదట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మార్చి 8న రజనీ తనయ భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయులుగా ఆమె గుర్తింపు పొందనున్నారు.

అయితే తన ప్రదర్శన తిలకించడానికి తమ కుటుంబం నుంచి ఎవరూ న్యూయార్క్ రావడం లేదని ఐశ్వర్య తెలిపారు. 'అప్పా 2.0 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ధనుష్, నా సోదరి సౌందర్య వీఐపీ-2 సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. మా పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ చెన్నైలోనే ఉండాల్సి వచ్చింద'ని ఐశ్వర్య వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement