ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ

Rajinikanth to get Icon of Golden Jubilee award at IFFI - Sakshi

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది గోల్డెన్‌ జూబ్లీ జరుపుకోనుంది. గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను భారీగా నిర్వహించనున్నట్టు సమాచారం. గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా రజనీకాంత్‌కు ‘ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ’ అనే అవార్డు ప్రదానం చేయనున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవ్‌దేకర్‌ తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాకు రజనీకాంత్‌ అందిస్తున్న సేవలను గుర్తించి ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ 2019’లో ఆయనకు ఈ అవార్డు అందిస్తాం’’ అని ట్వీట్‌ చేశారు ప్రకాశ్‌. ‘‘ఈ గౌరవాన్ని నాకు ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని రజనీకాంత్‌ తన ట్వీటర్‌ ద్వారా తెలిపారు. ఈ ఉత్సవంలో ఫ్రెంచ్‌ నటి ఇసబెల్లా హుప్పెర్ట్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నారు. నవంబర్‌ 20 నుంచి 28 వరకూ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top