కాలా... ఇది కల కాదుగా! అంబేద్కర్‌గా మమ్ముట్టి? | rajanikanth in kala movie is ambedkarcharacter doing mammutti | Sakshi
Sakshi News home page

కాలా... ఇది కల కాదుగా! అంబేద్కర్‌గా మమ్ముట్టి?

Jun 5 2017 12:11 AM | Updated on Sep 5 2017 12:49 PM

కాలా... ఇది కల కాదుగా! అంబేద్కర్‌గా మమ్ముట్టి?

కాలా... ఇది కల కాదుగా! అంబేద్కర్‌గా మమ్ముట్టి?

‘దళపతి’ గుర్తుందా? మణిరత్నం ఈ సినిమా తీసి పాతికేళ్లు కావొచ్చు.

‘దళపతి’ గుర్తుందా? మణిరత్నం ఈ సినిమా తీసి పాతికేళ్లు కావొచ్చు. కానీ, అందులో రజనీకాంత్, మమ్ముట్టిల నటన ప్రేక్షకుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది. అంతలా మెస్మరైజ్‌ చేసిన రజనీ, మమ్ముట్టి మళ్లీ కలసి నటిస్తున్నారని చెన్నై టాక్‌. ‘కాలా’లో బీఆర్‌ అంబేద్కర్‌గా మమ్ముట్టి కనిపిస్తారని కోడంబాక్కమ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి.

‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్న ‘కాలా’ ఫస్ట్‌ లుక్‌లో ‘ఎంహెచ్‌ 01 బీఆర్‌ 1956’ నంబర్‌ ప్లేటున్న జీపుపై రజనీ కూర్చున్నారు కదా. దాన్ని బట్టి సినిమాలో బీఆర్‌ అంబేద్కర్‌కు సంబంధించిన సీన్లు ఉండే ఛాన్సుందని జనాలు కథలు అల్లేశారు. ఎందుకంటే... అంబేద్కర్‌ 1956లోనే మరణించారు గనుక! ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి... బీఆర్‌ అంబేద్కర్‌గా మమ్ముట్టి నటించనున్నారని చెబుతున్నారు. రజనీ ఫ్యాన్స్‌తో పాటు మమ్ముట్టి ఫ్యాన్స్‌ కూడా ఈ వార్త కల కాకూడదని కోరుకుంటున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్లను మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాలని ఆశ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement