breaking news
Mammatti
-
మిస్టర్ జేమ్స్!
మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి సూపర్ స్టార్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఓ నూతన దర్శకుడికి, అది కూడా ఓ కెమెరామేన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే కెమెరామేన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న ‘స్ట్రీట్‌లైట్స్’ సినిమా హాట్ టాపిక్ అయింది. తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’, ‘ఆవకాయ బిర్యానీ’ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు శ్యామ్‌దత్. ఆయన చెప్పిన కంటెంట్‌లో దమ్ము ఉంది కాబట్టే మమ్ముట్టి ఈ సినిమా చేస్తున్నారని మాలీవుడ్ వారు అంటున్నారు. ఈ సినిమాలో జేమ్స్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో మమ్ముట్టి నటిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే సీనియర్ కెమెరామేన్–డైరెక్టర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా 16వ శతాబ్దపు బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. సంతోష్ శివన్ ఆల్రెడీ ‘ఉరిమి’, ‘ఆనందభాద్ర’ చిత్రాలను మలయాళంలో డైరెక్ట్ చేశారు. అన్నట్లు.. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాకు సంతోష్శివన్నే సినిమాటోగ్రఫర్. -
కాలా... ఇది కల కాదుగా! అంబేద్కర్గా మమ్ముట్టి?
‘దళపతి’ గుర్తుందా? మణిరత్నం ఈ సినిమా తీసి పాతికేళ్లు కావొచ్చు. కానీ, అందులో రజనీకాంత్, మమ్ముట్టిల నటన ప్రేక్షకుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది. అంతలా మెస్మరైజ్ చేసిన రజనీ, మమ్ముట్టి మళ్లీ కలసి నటిస్తున్నారని చెన్నై టాక్. ‘కాలా’లో బీఆర్ అంబేద్కర్గా మమ్ముట్టి కనిపిస్తారని కోడంబాక్కమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ‘కాలా’ ఫస్ట్ లుక్‌లో ‘ఎంహెచ్ 01 బీఆర్ 1956’ నంబర్ ప్లేటున్న జీపుపై రజనీ కూర్చున్నారు కదా. దాన్ని బట్టి సినిమాలో బీఆర్ అంబేద్కర్‌కు సంబంధించిన సీన్లు ఉండే ఛాన్సుందని జనాలు కథలు అల్లేశారు. ఎందుకంటే... అంబేద్కర్ 1956లోనే మరణించారు గనుక! ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి... బీఆర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటించనున్నారని చెబుతున్నారు. రజనీ ఫ్యాన్స్‌తో పాటు మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా ఈ వార్త కల కాకూడదని కోరుకుంటున్నారు. ఇద్దరు సూపర్స్టార్లను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఆశ పడుతున్నారు.