జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి | Rajamouli thanks the audience for Baahubali success | Sakshi
Sakshi News home page

జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి

Apr 30 2017 1:46 PM | Updated on Jul 14 2019 4:05 PM

జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి - Sakshi

జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి

ఐదేళ్లుగా రాజమౌళి చేస్తున్న యజ్ఞం పూర్తయి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తెలుగు సినిమాను

ఐదేళ్లుగా రాజమౌళి చేస్తున్న యజ్ఞం పూర్తయి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులపై రాజమౌళి స్పందించాడు. ఆదివారానికి రిలీజ్ హడావిడి కాస్త తగ్గటంతో తన సోషల్ మీడియా పేజ్ లో తనకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

'బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ కు రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వటం సహజం. బాహుబలి అభిమానుల ప్రేమ, సపోర్ట్ మూలంగానే ఆ ఇబ్బందులన్నింటినీ యూనిట్ దాటగలిగింది. గత ఐదేళ్లుగా మాతో ఉండి, ప్రతీ సందర్భంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. మీరు మా మిగతా జీవితమంతా గుర్తుండి పోయే ఘనవిజయాన్ని అందించారు' అంటూ ప్రేక్షకులకు ట్వీట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు రాజమౌళి.

 

Advertisement
 
Advertisement
Advertisement