దాసరి బాటలో రాజమౌళి | Rajamouli Imitating Dasari | Sakshi
Sakshi News home page

దాసరి బాటలో రాజమౌళి

Sep 2 2015 10:00 AM | Updated on Jul 14 2019 4:05 PM

దాసరి బాటలో రాజమౌళి - Sakshi

దాసరి బాటలో రాజమౌళి

తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా దర్శక రత్న దాసరి నారాయణకి చాలా పేరుంది. అందుకే గతంలో సినీ రంగానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో దాసరి తప్పకుండా...

తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా దర్శక రత్న దాసరి నారాయణకి చాలా పేరుంది. అందుకే గతంలో సినీ రంగానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో దాసరి తప్పకుండా కనిపించేవారు. సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచి సక్సెస్ మీట్ల వరకు ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ ఆయన దర్శనమిచ్చేవాడు. అంతేకాదు తనవంతుగా చిత్రయూనిట్కు సలహాలు, సూచనలు ఇస్తూ దాసరి అంటే అందరివాడన్న ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా మారిన జక్కన్న, ప్రస్తుతం ప్రతి సినిమా ఫంక్షన్ లోనూ కనిపిస్తున్నాడు. కేవలం ఫంక్షన్లకు హాజరవ్వటమే కాదు. కొత్త సినిమాల ఫస్ట్ లుక్ రిలీజ్ల నుంచి, ట్రైలర్ లాంచ్ ల వరకు ప్రతి విషయం పై స్పందిస్తూ అందరికీ పెద్దదిక్కుగా మారుతున్నాడు.  ఆయా సినిమాలకు సంబంధించి పలు విషయాలను తన ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. వాళ్ల నటనను, పనితనాన్ని మెచ్చుకోవటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement