కుమారి లేకుండా మరో సినిమా..! | raj tarun movie with kumari 21f unit | Sakshi
Sakshi News home page

కుమారి లేకుండా మరో సినిమా..!

Jul 29 2017 12:14 PM | Updated on Sep 5 2017 5:10 PM

కుమారి లేకుండా మరో సినిమా..!

కుమారి లేకుండా మరో సినిమా..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. రాజ్ తరుణ్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాతో హీరోయిన్ హెబ్బా పటేల్, హీరో రాజ్ తరుణ్ లు బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. సుకుమార్ కు కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసే ధైర్యాన్నిచ్చింది కుమారి 21ఎఫ్.

ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. సుకుమార్ నిర్మాణంలో సూర్య ప్రతాప్ దర్శకుడిగా రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ నే తీసుకుంటున్నారు. పూర్తిగా కుమారి 21 ఎఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను మాత్రం మారుస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ల కాంబినేషన్ చాలా సార్లు రిపీట్ అవ్వటంతో కొత్త సినిమా కోసం మరో హీరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement