రూమర్స్‌పై రాజ్‌ తరుణ్‌ క్లారిటీ

Raj Tarun About Telugu Remake Of Naanum Rowdy Dhaan - Sakshi

ఇటీవల రాజుగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్‌ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలంగా సరైన హిట్స్‌లేక ఇబ్బందుల్లో ఉన్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ ఓ కోలీవుడ్ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళ్ లో సూపర్‌ హిట్ అయిన నేనూం రౌడీదాన్‌ చిత్రాన్ని తెలుగులో రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై రాజ్‌ తరుణ్ స్పందించాడు. తాను ఏ రీమేక్ సినిమా చేయటం లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్‌ తరుణ్‌. ప్రస్తుతం తను చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉందని వెల్లడించిన ఈ యంగ్ హీరో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనల్‌ చేయలేదని తెలిపారు. దీంతో కొద్ది రోజులు ఫిలిం సర్కిల్స్‌ లో వినిపిస్తున్న నానూం రౌడీదాన్‌ రీమేక్‌ వార్తలు రూమర్స్‌ అని తేలిపోయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top