Hebbah Patel
-
మిరాకిల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది
‘‘కుమారి 21ఎఫ్, ఈడో రకం–ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్లో ఉన్నప్పటికీ ‘మిరాకిల్’ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని హెబ్బా పటేల్ అన్నారు. రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తుండగా, సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తయింది. ‘‘ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కొండమడుగు గ్రామ ప్రజల సహకారాన్ని మా యూనిట్ మర్చిపోదు’’ అన్నారు. ‘‘90 శాతం షూట్ పూర్తయింది. త్వరలో చివరి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ శ్రీకాంత్ తెలిపారు. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే.. పూజిత స్టన్నింగ్ లుక్స్
► పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే ► వెకేషన్ ఫోటోలు షేర్ చేసిన అనన్య పాండే ► చందమామ కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఫోటోలు ► పొడుగు కాళ్ల సుందరిలీ ఫోటోలకు ఫోజులిచ్చిన శివానీ ► ఆరేంజ్ డ్రెస్‌లో పూజిత పొన్నాడ స్టన్నింగ్ స్టిల్స్ View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రూమర్స్‌పై రాజ్ తరుణ్ క్లారిటీ
ఇటీవల రాజుగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలంగా సరైన హిట్స్లేక ఇబ్బందుల్లో ఉన్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఓ కోలీవుడ్ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన నేనూం రౌడీదాన్ చిత్రాన్ని తెలుగులో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందించాడు. తాను ఏ రీమేక్ సినిమా చేయటం లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం తను చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉందని వెల్లడించిన ఈ యంగ్ హీరో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు. దీంతో కొద్ది రోజులు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న నానూం రౌడీదాన్ రీమేక్ వార్తలు రూమర్స్ అని తేలిపోయింది. -
మే 19న 'ఏంజెల్' రిలీజ్
నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఏంజెల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న నాగ అన్వేష్ హీరో చేస్తున్న రెండో సినిమా ఏంజెల్. -
' హెబ్బా పటేల్ ' సందడి


