మిరాకిల్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది | Hebbah Patel about Miracle movie | Sakshi
Sakshi News home page

మిరాకిల్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది

Mar 30 2026 4:22 AM | Updated on Mar 30 2026 4:22 AM

Hebbah Patel about Miracle movie

‘‘కుమారి 21ఎఫ్, ఈడో రకం–ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్‌’ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ నా కెరీర్‌లో ఉన్నప్పటికీ ‘మిరాకిల్‌’ నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని హెబ్బా పటేల్‌ అన్నారు. రమేష్‌ ఎగ్గిడి, శ్రీకాంత్‌ మొగదాసు, చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాకిల్‌’. ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణధీర్‌ బీసు హీరోగా, హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సురేష్, శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తయింది. ‘‘ఇప్పటివరకు ఇండియన్‌ స్క్రీన్‌ పై రాని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కొండమడుగు గ్రామ ప్రజల సహకారాన్ని మా యూనిట్‌ మర్చిపోదు’’ అన్నారు. ‘‘90 శాతం షూట్‌ పూర్తయింది. త్వరలో చివరి షెడ్యూల్‌ ఆరంభిస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement