సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.
ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.


