ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌..! | Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Likely To Release In OTT On This Date, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌..!

Mar 29 2026 1:15 PM | Updated on Mar 29 2026 1:54 PM

 Ustaad Bhagat Singh Will Be OTT Streaming this date

పవన్ కల్యాణ్‌ నటించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి నెట్టింట వైరల్‌ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే,  ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్‌ సంస్థ సాక్నిల్క్‌ పేర్కొంది. ఓవర్సీస్‌లో ఉస్తాద్‌ కనీసం 1మిలియన్‌ మార్క్‌ కూడా దాటలేదు. ధురంధర్‌-2 హిట్‌ కావడంతో చాలా స్క్రీన్స్‌ నుంచి ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాన్ని తొలగించారు.

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్‌ కాకపోవడంతో పాటుగా ధురంధర్‌-2 దెబ్బ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో థియేట్రికల్ రన్‌లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారట. ఏప్రిల్‌ 17న నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ తేదీలో కుదరకపోతే ఏప్రిల్‌ 24న తప్పకుండా ఉస్తాద్‌ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్స్‌లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయినా మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement