సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్‌ | Ram Charan, Sharwanand Makeover captivating Focus of film industry | Sakshi
Sakshi News home page

సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్‌

Mar 29 2026 11:20 PM | Updated on Mar 30 2026 10:27 AM

Ram Charan, Sharwanand Makeover captivating Focus of film industry

ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్‌గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.

వీరిద్దరూ తమ మేకోవర్స్‌తో టోటల్‌  ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్‌ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.

చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్‌లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.

అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.

42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్‌‌గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement