హీరోగా సన్నాఫ్‌ విజయన్‌ | Rahul Vijay is the hero of the new film started in Hyderabad. | Sakshi
Sakshi News home page

హీరోగా సన్నాఫ్‌ విజయన్‌

Aug 18 2017 12:16 AM | Updated on Oct 2 2018 3:04 PM

హీరోగా సన్నాఫ్‌ విజయన్‌ - Sakshi

హీరోగా సన్నాఫ్‌ విజయన్‌

‘ముప్ఫైఏళ్లుగా ఇండస్ట్రీ నాకెంతో అండగా నిలబడింది. నేను ఇండస్ట్రీకి చాలా రుణపడిపోయా.

‘ముప్ఫైఏళ్లుగా ఇండస్ట్రీ నాకెంతో అండగా నిలబడింది. నేను ఇండస్ట్రీకి చాలా రుణపడిపోయా. ఆ రుణం తీర్చుకోవడానికి మా అబ్బాయి రాహుల్‌ విజయ్‌ను హీరోగా, కూతురు దివ్యా విజయ్‌ను నిర్మాతగా పరిచయం చేస్తున్నా’’ అని ఫైట్‌మాస్టర్‌ విజయ్‌ అన్నారు. రాహుల్‌ విజయ్‌ హీరోగా రాము కొప్పుల దర్శకత్వంలో వీయస్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై దివ్యా విజయ్‌ నిర్మిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి విజయన్‌ మాస్టర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా,  దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. పూరి జగన్నాథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రాము కొప్పుల మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశా. నేను చెప్పిన కథ నచ్చడంతో విజయ్‌గారు ఈ సినిమాకి డైరెక్షన్‌ చేసే చాన్స్‌ ఇచ్చారు. మంచి కథ కుదిరింది’’ అన్నారు. ‘‘మేఘానంద్, సత్యానంద్‌గారి వద్ద రాహుల్‌ యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నెల 21న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు దివ్య. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ఛోటా కె.నాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజు ఓలేటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement