ఈ సినిమాతో నా ఇమేజ్‌ మారిపోతుంది

Raashi Khanna Speech At World Famous Lover Movie - Sakshi

‘‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ రిలీజ్‌  అయినప్పుడు టీజర్‌ బావుంది అన్నారు. కానీ నా పాత్రకి కొన్ని నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఇలాంటి పాత్ర రాశీఖన్నా ఎందుకు చేసింది? అన్నారు. యాక్టర్‌ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉండలేం కదా. ఎప్పుడో ఓసారి దాన్ని బ్రేక్‌ చేయాలి. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో అలాంటి ప్రయత్నం చేశాను.  ఈ సినిమాతో నా ఇమేజ్‌ మారిపోతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాశీఖన్నా. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కేయస్‌ రామారావు నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు.

► ఈ సినిమాలో నేను చేసిన యామినీ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. స్ట్రాంగ్‌ రోల్‌. చాలెంజింగ్‌గా అనిపించింది.

► యామినీ పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. నా పాత్ర నేనే చేసినట్టుంది. నిజ జీవితంలో నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోలేను. స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఎమోషనల్‌ సైడ్‌ని బయటకు చూపించకూడదనుకుంటాను. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.  

► సాధారణంగా నాకు లవ్‌ స్టోరీలంటే చాలా ఇష్టం. దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.  

► సినిమాలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నేనే ఉండాలి అనుకోను. మనం చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నాకేం ప్రాబ్లమ్‌ లేదు. యాక్టర్‌గా నేను చాలా సెక్యూర్‌గా ఉంటాను.ఒకవేళ ఈ సినిమాలో నా పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోమంటే ఐశ్వర్యా రాజేశ్‌ చేసిన పాత్ర చేస్తాను.

► వేలంటైన్స్‌ డే అంటే నాకు ఇష్టం. ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని చెబుతుంటారు. వేలంటైన్స్‌ డేకి ఇది పర్పెక్ట్‌ సినిమా.  ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటిస్తాను.

► ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు ‘అర్జున్‌ రెడ్డి 2’ అన్నారు. కానీ ట్రైలర్‌తో ఆ అభిప్రాయం మారిపోయింది. విజయ్‌ గడ్డంతో ఉంటే అర్జున్‌ రెడ్డిలానే ఉంటారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top