మలుపులు తిరిగిన ప్రణయం | Ra Ra Krishnayya ready for release | Sakshi
Sakshi News home page

మలుపులు తిరిగిన ప్రణయం

Jun 22 2014 11:36 PM | Updated on Sep 15 2019 12:38 PM

మలుపులు తిరిగిన ప్రణయం - Sakshi

మలుపులు తిరిగిన ప్రణయం

ఆ జంట ప్రేమ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. ఆ ప్రయాణం అలానే సాగితే ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చునేవారు. కానీ, అనుకోకుండా ఆ ప్రేమకథ ఓ మలుపు తీసుకుంటుంది?

ఆ జంట ప్రేమ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. ఆ ప్రయాణం అలానే సాగితే ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చునేవారు. కానీ, అనుకోకుండా ఆ ప్రేమకథ ఓ మలుపు తీసుకుంటుంది? ఆ మలుపు ఎలాంటిది?  ఆ ప్రేమికులు.. దంపతులు కావడానికి ఏం చేశారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. సందీప్ కిషన్, రెజీనా జంటగా యస్వీకే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
 జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం ద్వారా మహేశ్‌బాబు. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అచ్చు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ‘లెజెండ్’ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చే పాత్రను జగపతిబాబు చేశారు. ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేమ, వినోదం మేళవించిన కథ ఇది. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రం కావడంతో ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement