పూరీని కాదని.. కొత్త దర్శకుడితో.. | R Narayanamurthy Head Constable Venkatramaiah | Sakshi
Sakshi News home page

పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..

Oct 18 2016 3:05 PM | Updated on Sep 4 2017 5:36 PM

పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..

పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..

సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎదిగిన నారాయణమూర్తి కొంత కాలంగా తన స్వీయ దర్శకత్వంలో...

సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎదిగిన నారాయణమూర్తి కొంత కాలంగా తన స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. దాసరి లాంటి దిగ్దర్శకుల సినిమాల్లో హీరోగా నటించిన నారాయణమూర్తి.., ఈ జనరేషన్ దర్శకులు పిలిచి అవకాశాలు ఇచ్చినా కాదనేశారు.

టెంపర్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్, ఓ కీలక పాత్రకు ఆర్ నారాయణమూర్తిని సంప్రదించినా.. బయటి దర్శకులతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదంటూ కాదన్నారు. అయితే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించారు పీపుల్స్ స్టార్. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించిన చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ నచ్చటంతో నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించేందుకు అంగకీరించారు. ఈ సినిమాలో నారాయణమూర్తి జంటగా స్టార్ హీరోయిన్ జయసుథ నటిస్తుండటం విశేషం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement