సీనియర్ నిర్మాతలకే ఇబ్బందులు తప్పడంలేదు! | Problems with senior producers | Sakshi
Sakshi News home page

సీనియర్ నిర్మాతలకే ఇబ్బందులు తప్పడంలేదు!

Jun 9 2015 12:04 AM | Updated on Sep 3 2017 3:26 AM

సీనియర్ నిర్మాతలకే ఇబ్బందులు తప్పడంలేదు!

సీనియర్ నిర్మాతలకే ఇబ్బందులు తప్పడంలేదు!

నేను చిత్రపరిశ్రమకు వచ్చి ముప్ఫయ్ మూడేళ్లయ్యింది. కళాదర్శకునిగా మంచి పేరు తెచ్చుకోగలిగాను. నిర్మాణం మీద ఆసక్తి ఉండటంతో ఫ్రెండ్లీ మూవీస్ ఆరంభించాను.

‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి ముప్ఫయ్ మూడేళ్లయ్యింది. కళాదర్శకునిగా మంచి పేరు తెచ్చుకోగలిగాను. నిర్మాణం మీద ఆసక్తి ఉండటంతో ఫ్రెండ్లీ మూవీస్ ఆరంభించాను. ఈ సంస్థ ఆరంభించిన ఈ పదహారేళ్లల్లో తొమ్మిది సినిమాలు తీశాను’’ అని అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ -‘‘సినిమా నిర్మాణం అంత సులువు కాదు. సీనియర్ నిర్మాతనైన నేనే ఓ సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.

ఇక కొత్త నిర్మాతల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది’’ అని వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం అడ్డాల చంటి నిర్మిస్తున్న పదో చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో త్వరలో సినిమాలు నిర్మించనున్నానని, అలాగే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నానని అడ్డాల చంటి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement