యోగా గురువు | Priyanka Chopra's new look from Isn't It Romantic is out | Sakshi
Sakshi News home page

యోగా గురువు

Jan 6 2019 3:30 AM | Updated on Jan 6 2019 3:31 AM

Priyanka Chopra's new look from Isn't It Romantic is out - Sakshi

‘ఈజింట్‌..’ లో ప్రియాంకా చోప్రా

యోగా టీచర్‌గా క్లాసులను కంప్లీట్‌ చేశారు ప్రియాంకా చోప్రా. ఆ క్లాసులు ఎలా జరిగాయి? అనేది ప్రేమికుల రోజున తెలుస్తుంది. ప్రియాంకా చోప్రా, లియమ్‌ హెమ్స్‌వర్త్, రెబెల్‌ విల్సన్, ఆడమ్‌ డివైన్‌ ముఖ్య తారలుగా రూపొందిన హాలీవుడ్‌ మూవీ ‘ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’. టాడ్‌ స్ట్రాస్‌–గల్సన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యోగా అంబాసిడర్‌ ఇసాబెల్లా పాత్రలో నటించారు ప్రియాంకా చోప్రా. పాత్ర పరంగా కొన్ని సీన్స్‌లో యోగా క్లాసులను కండెక్ట్‌ చేస్తారట.

ఈ సినిమాను వచ్చే నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంకా లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌లో ప్రియుడు నిక్‌ జోనస్‌తో ఏడడుగులు వేసిన ప్రియాంకా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఫర్హాన్‌ అక్తర్, జైరా వసీమ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సోనాలి బోస్‌ దర్శకురాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement