పరువు తీసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్‌ | Priyanka Chopra Insulting Indian Film Industry, Video Viral | Sakshi
Sakshi News home page

Jun 11 2018 12:47 PM | Updated on Jun 11 2018 1:01 PM

Priyanka Chopra Insulting Indian Film Industry, Video Viral - Sakshi

నటి ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా క్వాంటికో ఎపిసోడ్‌లో హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, అది కాస్త వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె చేసిన వ్యవహారం తాలూకూ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఓ అవార్డుల వేడుకకు హాజరైన ప్రియాంక అక్కడి వ్యాఖ్యాతతో మాట్లాడుతూ... ‘భారతీయ సినిమాలు అంటే ఏం ఉండదు.. కేవలం నడుము(హిప్‌) మరియు పై భాగం(బూ*) ఆడించటమే. అక్కడి చిత్రాల్లో అలా స్టెప్పులేస్తే  సరిపోతుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సరదాగా మూమెంట్స్‌ చేసి మరీ చూపించారు. తన క్రేజ్‌ను పెంచుకోడానికి దిగజారి భారతీయ చలన చిత్రపరిశ్రమ పరువు తీయాలా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

పాత వీడియోనే... అయితే తర్వాత అది 2016 ఎమ్మీ అవార్డు వేడుకల తాలూకూ వీడియో అన్నది తేలింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వైఖరిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఆ వీడియోను బయటకు దులిపిన కొందరు దానిని వైరల్‌ చేస్తున్నారు. అఫ్‌ కోర్స్‌ ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత.. అదే స్థాయిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.. టూరిజం క్యాలెండర్‌ కోసం చేసిన ఓ ఫోటో షూట్‌లో హాట్‌ హాట్‌గా ఫోజులివ్వగా, ఆ అంశం అసెంబ్లీని కుదిపేసింది కూడా. (నటి హాట్‌ ఫోటో.. అసెంబ్లీలో దుమారం)

Advertisement
 
Advertisement
Advertisement