బావగారి పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి! | Priyanka Chopra Attends Sophie Turner And Joe Jonas Wedding | Sakshi
Sakshi News home page

బావగారి పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి!

May 3 2019 12:30 PM | Updated on May 3 2019 12:32 PM

Priyanka Chopra Attends Sophie Turner And Joe Jonas Wedding - Sakshi

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ నటి సోఫియా టర్నర్‌- హాలీవుడ్‌ సింగర్‌ జో జోనస్‌ల వివాహం కొద్ది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. లాస్‌వేగాస్‌లో ఎల్విస్‌ ఇమ్‌పెర్సొనేటర్‌(ప్రఖ్యాత సింగర్‌ ఎల్విస్‌ ప్రెస్లీకి నివాళిగా పాటలు పాడే వ్యక్తి) సమయంలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు.  బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌ వేడుక అనంతరం జరిగిన ఈ సంప్రదాయేతర వివాహంలో జోనస్‌ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా తన భర్త నిక్‌ జోనస్‌తో బావగారి పెళ్లిలో సందడి చేశారు. వివాహ సమయంలో తోడి కోడలు డేనియల్‌ జోనస్‌తో కలిసి సోఫీ టర్నర్‌కు దగ్గరగా కూర్చున్న ప్రియాంక.. పెళ్లైన వెంటనే సోఫీని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కొత్త పెళ్లి కూతురు సోఫీ పూల బొకే కోసం వెతుకుతుండగా ఆమెకు సహాయం చేసేందుకు నిక్‌, ప్రియాంక పోటీ పడ్డారు. భార్య కంటే ముందుగానే పూలగుత్తిని కనుగొన్న నిక్‌.. దానిని సోఫీకి అందజేశాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు అధికారికంగా వెలువడకపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. దీంతో జోనస్‌ బ్రదర్స్‌ అభిమానులు జో-సోఫీలపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌ల వివాహం రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సోఫీ టర్నర్‌ కూడా హాజరైంది.

Advertisement
 
Advertisement
Advertisement