
నిశ్చితార్థం చేసుకున్న సినీనటి
దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలలో హీరోయిన్‌గా నటించి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకున్న హీరోయిన్ ప్రియమణికి శుక్రవారం నిశ్చితార్థం జరిగింది.
బెంగళూరు : దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలలో హీరోయిన్‌గా నటించి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకున్న హీరోయిన్ ప్రియమణికి శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. బెంగళూరులోని బనశంకరిలోని ఆమె స్వగృహంలో తన కుటుంబసభ్యుల మధ్య చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారి, ఆమె ప్రియుడు ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం జరిగింది. తామిద్దరం చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నామని.. త్వరలో ఆడంబరాలకు దూరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో యమదొంగ, రగడ తదితర చిత్రాల్లో ప్రియమణి నటించిన విషయం విదితమే.