ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? | 'Prema Geema Jantha Nai' to release on May 31 | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది?

May 26 2014 12:33 AM | Updated on Sep 2 2017 7:50 AM

ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది?

ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది?

ప్రేమ చాలా మధురంగా ఉంటుంది? అని ఎవరైనా ఆ యువకుడితో అంటే ఇంతెత్తున విరుచుకుపడతాడు. అబ్బాయిలను తమ చుట్టూ తిప్పుకుని, వాళ్ల కెరీర్‌తో ఆడుకోవడంతో పాటు, పర్సులను

ప్రేమ చాలా మధురంగా ఉంటుంది? అని ఎవరైనా ఆ యువకుడితో అంటే ఇంతెత్తున విరుచుకుపడతాడు. అబ్బాయిలను తమ చుట్టూ తిప్పుకుని, వాళ్ల కెరీర్‌తో ఆడుకోవడంతో పాటు, పర్సులను కూడా అమ్మాయిలు ఖాళీ చేస్తారని అతని అభిప్రాయం. ప్రేమపై అంత దురభిప్రాయం ఉన్న ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’. ఇండియన్ ఐడల్ శ్రీరామ్‌చంద్ర హీరోగా మద్దాల భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. సుబ్బు ఆర్వీ దర్శకుడు. చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ - ‘‘వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. శ్రీరామచంద్రకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రం అవుతుంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement