ఆ ప్రేమ రామ్‌లో కనిపించింది.. హమిదా ఎమోషనల్‌ | Bigg Boss 5 Telugu: Hamida Open About Her Relationship With Sri Ramachandra | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ కంటే.. శ్రీరామే ఎక్కువ..హమిదా ఎమోషనల్‌

Oct 13 2021 6:29 PM | Updated on Oct 13 2021 8:41 PM

Bigg Boss 5 Telugu: Hamida Open About Her Relationship With Sri Ramachandra - Sakshi

బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ కచ్చితంగా నడుస్తుంది. గత సీజన్‌లో అయితే ఏకంగా ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడిచింది. మోనాల్‌-అఖిల్‌- అభిజిత్‌ మధ్య జరిగిన లవ్‌ట్రాక్‌ బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సీజన్‌లో కూడా శ్రీరామ్‌, హమిద మధ్య లవ్‌ ట్రాక్‌ బాగానే నడిచింది. కానీ అనుకోకుండా హమిద గతవారం ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయింది. అయినప్పటికీ శ్రీరామ్‌ని మర్చిపోలేకపోతుంది.

తను ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో నూ శ్రీరామ్‌ గురించి స్పెషల్‌గా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వచ్చే కంటే కూడా అక్కడ శ్రీరామ్‌ను వదిలి రావడం ఎక్కువగా బాధ అనిపించిందని చెప్పింది. రామ్‌తో ఏర్పడిన కనెక్షన్‌ ఆ ఇంటి వరకు మాత్రమే పరిమితం కాదని.. బయటకు వచ్చిన తర్వాత కూడా తమ బంధం కొనసాగుతుందని తెలిపింది. తాను, శ్రీరామ్‌ లవర్స్‌ కాదని, తమ మధ్య మంచి రిలేషన్‌ఉందని చెప్పింది.

‘ నేను ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నానో అది శ్రీరామ్‌ దగ్గర నుంచి నాకు లభించింది. తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.  మేమిద్దరం అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటుండే వాళ్లం. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చే ముందు రోజు రాత్రి కూడా నేను తనతోనే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోయాను’ అంటూ హమీద కన్నీరు పెట్టుకున్నారు. శ్రీరామ్ తర్వాత తనకు ఇంట్లో అంత జెన్యూన్‌గా కనెక్ట్ అయిన మరో పర్సన్ యాంకర్ రవి అని చెప్పింది. అతడిని అన్నయ్య అని పిలుస్తానని.. ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేశాడు అంటుంది. ఇంట్లో మిగిలిన వాళ్ళతో తనకు జెన్యూన్‌గా కనెక్షన్ లేదని.. కేవలం శ్రీ రామచంద్రతో మాత్రమే కలిసాను అంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement