ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ | 'Prema Geema Janta Nai' Getting Ready For Release | Sakshi
Sakshi News home page

ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ

Nov 20 2013 1:04 AM | Updated on Sep 2 2017 12:46 AM

ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ

ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ

ప్రపంచం మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతోంది. యువతరం అయితే.. ప్రేమ నామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు..

ప్రపంచం మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతోంది. యువతరం అయితే.. ప్రేమ నామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు.. గీమా లేదు’ అంటూ ప్రేమను కూరలో కరేపాకులా తీసిపారేస్తున్నాడు. ఇంతకీ ఎవరీ అబ్బాయి? ప్రేమంటే ఇతగాడికి ఎందుకంత ద్వేషం? ప్రేమను ఇంతగా ద్వేషించే ఈ కుర్రాడి జీవితంతో ప్రేమ ఎలా ఆడుకుంది? ఆనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమగీమా జాన్‌తానయ్’. 
 
 ‘ఇండియన్ ఐడిల్’ శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్ (భాను), దాడి బాలభాస్కర్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీరామచంద్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మహానటుడు ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీరంగారావు విలన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో ఉండే ప్రేమ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement