ఎన్టీఆర్‌తో కలిసి రభస చేస్తోందట


ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, శకుని... బెంగళూరు భామ ప్రణీత నటించిన ఈ మూడు సినిమాలూ పరాజయాల్ని మూట కట్టుకున్నాయి. దాంతో ‘ఐరన్‌లెగ్’ అనే పదం మొన్నటివరకూ ప్రణీత ఇంటిపేరై కూర్చుంది. అయితే...  ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు.. ‘అత్తారింటికి దారేది’ అనే ఒకే ఒక్క సినిమా ప్రణీత తలరాతనే మార్చేసింది. నిజానికి ఈ సినిమాలో ప్రణీత చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టర్. కానీ ప్రధాన కథానాయిక సమంత కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ప్రణీత. ఒక్క విజయంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ప్రణీత జపం చేస్తోంది. 

 

 అందుకు తగ్గట్టుగానే... మరో ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రణీతకు అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకునిగా ‘కంది రీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘రభస’ చిత్రంలో ఓ కథానాయికగా ప్రణీతను ఎంపిక చేశారు. అయితే... ఈ సినిమాలో కూడా ప్రధాన కథానాయిక సమంతానే కావడం విశేషం. ‘అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీత కలిసి నటిస్తున్న సినిమా ఇదే. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top