సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

Prabhas Throws Intense Looks In the First Poster of Saaho - Sakshi

‘డార్లింగ్స్‌ రేపు మీ అందరికీ ఓ సర్‌ప్రైజ్‌ ఉంది’ అని సోమవారం అభిమానులను ఉద్దేశించి ప్రభాస్‌ అన్నారు. అంతే... ఆ సర్‌ప్రైజ్‌ ఏమై ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ‘సాహో’ కొత్త పోస్టర్‌ అని, టీజర్‌ రిలీజ్‌ అని, మేకింగ్‌ వీడియో అని రకరకాలుగా ఊహించుకున్నారు. కొందరి ఊహను ప్రభాస్‌ నిజం చేస్తూ మంగళవారం తన తాజా చిత్రం ‘సాహో’ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా కన్ఫార్మ్‌ చేశారు. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’.

ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మంగళవారం విడుదలైన ‘సాహో’ కొత్త పోస్టర్‌లో సీరియస్‌ అండ్‌ ఇంటెన్స్‌ లుక్స్‌తో ప్రభాస్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1, షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’ వీడియోలకి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన ప్రభాస్‌ కొత్త పోస్టర్‌కు అంతే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top