ఏండే.. పెద్ద చాలెంజ్‌ అండె!

prabhas in sahoo movie in 3 languages - Sakshi

‘ఏండే.. ఓ పాట పాడండె’. ‘ఎన్నాంగ.. ఒరు పాట్టు పాడుంగ’. ‘జీ.. ఏక్‌ గానా గావో’...తెలుగు, తమిళ్, హిందీ భాషలు తెలిసినవాళ్లకు చెప్పినదే చెబుతున్నామని అర్థమయ్యే ఉంటుంది. ‘బుజ్జిగాడ్‌ మేడిన్‌ చెన్నై’లో ప్రభాస్‌ ‘ఏండే.. ఓ పాట పాడండె’ అని త్రిషతో కామెడీ చేసిన విషయం కూడా గుర్తుకు రాకమానదు. మరి.. తమిళ్, హిందీలో ఈ డైలాగ్‌ ఎందుకు రాసినట్లూ అనుకుంటున్నారా? మరేం లేదు.. ఇప్పుడు ప్రభాస్‌ తెలుగులో ఒక డైలాగ్‌ చెప్పగానే, వెంటనే హిందీలో, ఆ వెంటనే తమిళంలో చెబుతున్నారు. మరి.. ఒకే సినిమాని మూడు భాషల్లో చేసినప్పుడు అలానే కదా చెప్పాలి.

సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ‘సాహో’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘‘ఒక లాంగ్వేజ్‌లో డైలాగ్‌ కరెక్ట్‌ కుదరగానే, డైరెక్టర్‌ టేక్‌ ఓకే అంటారు. అలాగని రిలాక్స్‌ అవ్వడానికి లేదు. వెంటనే ఇంకో భాషలో అదే మాడ్యులేషన్‌తో, అదే ఎక్స్‌ప్రెషన్‌తో డైలాగ్‌ చెప్పాలి. ఇది ఓకే అయిందంటే వెంటనే ఇంకో భాష. ఎంతైనా మూడు భాషల్లో సినిమా అంటే ఈజీ కాదు. ఒక్కోసారి ఎక్కువ టేక్స్‌ తీసుకోవాల్సి వస్తుంది. నటీనటులకు మాత్రమే కాదు టెక్నీషియన్స్‌కి కూడా ఇది కష్టమే. పెద్ద చాలెంజ్‌’’ అని పేర్కొన్నారు ప్రభాస్‌. ఏండే.. నిజంగా చాలెంజే కదండె. ఎన్నాంగా.. రుంబ చాలెంజ్‌ ఇల్లీంగ..  జీ... బహుత్‌ బడా చాలెంజ్‌ హై నా!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top