ఉతుకుడే ఉతుకుడు!

Prabhas Sahoo Action episodes completed - Sakshi

విలన్స్‌ను ఉతికారేశారు ప్రభాస్‌. ఆ ఉతుకుడు ఏ రేంజ్‌లో ఉంది? అనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ యాక్షన్‌ను హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ బాబ్‌ బ్రోన్‌ డిజైన్‌ చేశారట. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా తాజా యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘మరో యాక్షన్‌ ఎపిసోడ్‌ను కంప్లీట్‌ చేశాం. యాక్షన్‌ డైరెక్టర్స్‌ బాబ్‌ బ్రోన్, పెన్‌జాంగ్‌లు అమేజింగ్‌గా వర్క్‌ చేశారు’’ అని డైరెక్టర్‌ సుజిత్‌ పేర్కొన్నారు.

ఈ యాక్షన్‌ షెడ్యూల్‌లో శ్రద్ధా కూడా పాల్గొన్నారు. సో.. ఈ సినిమాలో ఆమె కూడా కొన్ని ఫైట్స్‌ను చేసి ఉంటారని ఊహించవచ్చు. ఆ మధ్య అబుదాబిలో ఓ సూపర్‌ చేజింగ్‌ ఫైట్‌ని షూట్‌ చేసింది ‘సాహో’ టీమ్‌. హైదరాబాద్‌లో తీసిన ఈ తాజా యాక్షన్‌ సీన్స్‌ కూడా హై ఓల్టేజ్‌లో ఉంటాయట. త్వరలో రొమేనియాలో కూడా ఓ చేజింగ్‌ ఫైట్‌ను ప్లాన్‌ చేశారట. దీన్ని బట్టి ఈ సినిమాలో యాక్షన్‌కు పెద్దపీట వేసినట్లు అర్థం అవుతోంది. నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ, ఎవెలిన్‌ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ ట్రైలింగ్వల్‌ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top