'బాహుబలి 2' మొదలైంది | Prabhas, rana, rajamouli bahubali 2 shoot begins | Sakshi
Sakshi News home page

'బాహుబలి 2' మొదలైంది

Dec 17 2015 2:08 PM | Updated on Aug 11 2019 12:52 PM

'బాహుబలి 2' మొదలైంది - Sakshi

'బాహుబలి 2' మొదలైంది

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బాహుబలికి సీక్వల్ మొదలైంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బాహుబలికి సీక్వల్ మొదలైంది. బాహుబలి చిత్రం వెండితెర మీద సృష్టించిన సంచలనాలు మర్చిపోకముందే ఆ సినిమాకు సీక్వల్ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావించాడు రాజమౌళి. అయితే అంచనాలు భారీగా పెరిగిపోవటంతో అందుకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అందుకే ముందు అనుకున్నట్టుగా 2016 చివర్లో కాకుండా 2017 మొదట్లో బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటికే ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా సినిమాకు తగ్గట్టుగా బాడీ పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. అందుకే తిరిగి సన్నబడటానికి కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసిన రాజమౌళి, గురువారం షూటింగ్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ బాహుబలి అధికారిక ఫేస్బుక్ పేజ్లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement