22 పెద్ద విజయం సాధించాలి | Prabhas launch 22 movie song | Sakshi
Sakshi News home page

22 పెద్ద విజయం సాధించాలి

Feb 23 2020 3:08 AM | Updated on Feb 23 2020 3:08 AM

Prabhas launch 22 movie song - Sakshi

రూపేష్, ప్రభాస్, శివకుమార్, బి.ఎ. రాజు

రూపేష్‌ కుమార్, సలోని మిశ్రా జంటగా నటించిన చిత్రం ‘22’. శివకుమార్‌  .బి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను ప్రభాస్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో చూశాను. బాగుంది. బి.ఎ. రాజుగారు, జయగారి అబ్బాయి శివకుమార్‌కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. పోలీస్‌ డ్రెస్‌లో రూపేష్‌ బాగున్నాడు. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్‌ మూవీ అనిపిస్తోంది. ‘22’ బిగ్‌ హిట్‌ కావాలి’’ అన్నారు.

‘‘ప్రభాస్‌ వంటì  స్టార్‌ పోలీస్‌ డ్రెస్‌లో నేను బాగున్నానని చెప్పడాన్ని అవార్డులా భావిస్తున్నా’’ అన్నారు రూపేష్‌. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చెప్పారు నిర్మాత సుశీలాదేవి. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ను ప్రభాస్‌గారు అడిగి తెలుసుకుని కథలో మంచి డెప్త్‌ ఉందన్నారు. బిగ్‌ హిట్‌ అవుతుందన్నారు. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన రూపేష్‌గారికి థ్యాంక్స్‌. కాస్లర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్‌ మ్యాడీ బాగా పాడారు’’ అన్నారు శివకుమార్‌.

‘‘మా అబ్బాయి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద విజయం సాధించాలన్న ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు బి.ఎ. రాజు. ‘‘చంటిగాడు’తో గీతరచయితగా నన్ను పరిచయం చేశారు జయగారు. వారి అబ్బాయి శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు రాయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కాసర్ల శ్యామ్‌. ‘‘రూపేష్‌కి, శివకు ఈ సినిమా పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది’’ అన్నారు సాయి కార్తీక్‌. కెమెరామేన్‌ రవికిరణ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ పెద్దిరాజు, సింగర్‌ మ్యాడీ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement