ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను కెలికిన సిద్ధార్థ్‌ | Prabhas Fans Comments On Siddharth Tweet | Sakshi
Sakshi News home page

Jul 17 2018 10:05 AM | Updated on Aug 25 2018 6:31 PM

Prabhas Fans Comments On Siddharth Tweet - Sakshi

భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌ ఒక్కోసారి వివాదాలకు కారణమవుతున్నాయి. కొంత మంది స్టార్స్‌ సరదాగా చేసిన కామెంట్స్ కారణంగా ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారు. తాజాగా దక్షిణాది హీరో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్‌ పుట్టిన రోజుకు సంబంధించిన సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ పై రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

తమిళ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా, ప్రభాస్‌ పుట్టిన రోజుకు మరో వంద రోజులు సమయముందంటూ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ నెక్ట్స్ పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ కామెంట్‌ చేశాడు. అయితే సిద్ధార్థ్‌ చేసిన కామెంట్ వెటకారంగా ఉందంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. కొంత మంది గంతలో ప్రభాస్‌, సిద్ధు కలిసి దిగిన ఫోటోను సిద్ధార్థ్‌కు ట్యాగ్ చేస్తూ ‘ఎందుకు భయ్యా నీ ఫ్రెండే కదా..’ అంటే మరి కొందరు ‘ టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ జోలికి వస్తే  చుక్కలు చూపించాల్సి వస్తుంది’ అంటూ కామెంట్‌ చేశారు.

సిద్ధార్థ్‌ మాత్రం తన కామెంట్స్‌ను సమర్ధించుకున్నాడు. ‘అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే ఫ్రీడం తీసుకున్నా. డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కద భయ్యా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. మరి సిద్ధు ఇచ్చిన రిప్లైతో ఫ్యాన్స్‌ శాంతిస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement