బాలీవుడ్ మల్టీ స్టారర్‌లో ప్రభాస్..?

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన కరణ్ జోహర్, ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు.
అయితే ప్రభాస్ బాలీవుడ్ కు మల్టీ స్టారర్ సినిమాతో పరిచయం అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్, రణవీర్‌లో ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో మల్టీస్టారర్ 2019లో సెట్స్‌మీదకు వెళ్లనుందట. అయితే ఈ విషయంపై ప్రభాస్ నుంచి గాని కరణ్ జోహర్ నుంచిగాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి