త్వరలో కేబీసీ ముగింపు.. అమితాబ్ కొత్త షో 'భూత్నాథ్ రిటర్న్స్' | Post KBC, it's 'Bhootnath Returns' and TV show for Big B | Sakshi
Sakshi News home page

త్వరలో కేబీసీ ముగింపు.. అమితాబ్ కొత్త షో 'భూత్నాథ్ రిటర్న్స్'

Nov 8 2013 3:29 PM | Updated on Sep 2 2017 12:25 AM

త్వరలో కేబీసీ ముగింపు.. అమితాబ్ కొత్త షో 'భూత్నాథ్ రిటర్న్స్'

త్వరలో కేబీసీ ముగింపు.. అమితాబ్ కొత్త షో 'భూత్నాథ్ రిటర్న్స్'

ఖాళీగా ఉండటం అనేది అమితాబ్ నిఘంటువులో ఎప్పుడూ లేదు. అందుకే.. ఇప్పుడు కొత్తగా 'భూత్నాథ్ రిటర్న్స్' అనే మరో షో ఆయన చేయబోతున్నారు.

కౌన్ బనేగా కరోడ్పతి.. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న అమితాబ్ బచ్చన్ను మళ్లీ తారాపథానికి తీసుకెళ్లిన షో. అలాంటి కేబీసీ ఇప్పుడు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే, ఖాళీగా ఉండటం అనేది అమితాబ్ నిఘంటువులో ఎప్పుడూ లేదు. అందుకే.. ఇప్పుడు కొత్తగా 'భూత్నాథ్ రిటర్న్స్' అనే మరో షో ఆయన చేయబోతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఒక్క మూడో సీజన్ మినహా కౌన్ బనేగా షోలన్నింటినీ అత్యంత విజయవంతం చేశారు. ఆ ఒక్క దాంట్లో మాత్రం షారుక్ ఖాన్ పాల్గొన్నారు.

''ఇప్పుడు కేబీసీ ప్రస్తుత సీజన్ ముగియడానికి మరో మూడు ఎపిసోడ్లు మాత్రమే మిగిలాయి. ఇన్ని నెలల పాటు నా మనసును, శరీరాన్ని కూడా పూర్తి బిజీగా ఉంచిన అలాంటి కార్యక్రమం చేయడం ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. దాని మధురస్మృతులు నన్ను వీడట్లేదు. కానీ సినిమా, టీవీ సీరియల్ పనులు ఎప్పటికీ అయిపోవు కాబట్టి, ఇప్పుడు 'భూత్నాథ్ రిటర్న్స్' షూటింగ్ మొదలైంది. ఇక ఇప్పుడంతా అదే పని ఉంటుంది'' అని తన వెబ్సైట్ srbachchan.tumblr.comలో అమితాబ్ పేర్కొన్నారు.

ఆర్.బాల్కి, షూజిత్ సర్కార్, విధు వినోద్ చోప్రా, సుజోయ్ ఘోష్, అనురాగ్ కశ్యప్, విపుల్ షా, అబ్బాస్-మస్తాన్, ఇంకా మరింతమందితో సినిమాలు ప్రాథమిక చర్చల దశలో ఉన్నాయని, అవి మొదలయ్యేవరకు తాను ఈ పనిలో ఉంటానని కూడా తెలిపారు. డిసెంబర్ మొదటివారంతో కేబీసీ ఏడో సీజన్ ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement