షరతులు వర్తిస్తాయి

Poorna Marriage Proposals In House - Sakshi

తమిళసినిమా: అందుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారని అంటోంది నటి పూర్ణ. కేరళా బ్యూటీ అయిన ఈమె తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కోలీవుడ్‌లో సవరకత్తి, కొడివీరన్, మణల్‌కయిరు–2 చిత్రాలతో మంచి ప్రతిభను నిరూపించుకున్న పూర్ణ ఎందుకనో ఈ మూడు భాషల్లోనూ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను పొందలేకపోయింది. అయినా వచ్చిన అవకాశాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానంటున్న ఈ భామ ప్రస్తుతం తమిళంలో నటించిన అడంగాదే చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మలయాళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడిని పలకరిస్తే చాలా విషయాలే చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం. నాకు మలయాళం చిత్రాల కంటే తమిళంలోనే మంచి అవకాశాలు, పేరు లభించింది. అందుకు కారణం మలయాళంలో నేను స్టార్‌ హీరోలతో ఎక్కువ చిత్రాలు చేయలేదు. డాన్స్‌ కళాకారిణి కావడంతో నన్ను స్టేజీలపైనే ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. అందుకే అక్కడ నాకు డాన్స్‌కు అవకాశాలు ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలే వస్తున్నాయి. అలాంటి వాటిని నేను అంగీకరించడం లేదు.

ఒక సమయంలో నేను నటించిన చట్టకారి చిత్రం ఫ్లాప్‌ అవడంతో నటనకు స్వస్తి చెప్పి నృత్య కార్యక్రమాలను చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అలాంటి సమయంలో ఇతర భాషల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అవి నమ్మకాన్ని కలిగించడంతో మళ్లీ నటించాలన్న నిర్ణయం తీసుకున్నాను. తమిళంలో నటించిన సవరకత్తి, కొడివీరన్‌ చిత్రాలు నా మనసు హత్తుకున్నాయి. నా ప్రతిభను వెలికి తీసిన చిత్రాలవి. ప్రస్తుతం నటనకు అవకాశం ఉన్న చిత్రాలనే నటించాలన్న విషయంలో దృఢంగా ఉన్నాను. మలయాళంలో మమ్ముట్టికి జంటగా ప్రస్తుతం నటిస్తున్న ఒరు కట్టనాడన్‌ బ్లాక్‌ చిత్రం అలాంటిదే. ఈ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని చాలా మంది అడుగుతున్నారు. నేను ముస్లిం అమ్మాయిని. ఇంట్లో పెళ్లి చేయాలన్న చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొన్ని నిబంధనలు ఎదురవుతున్నాయి. పెళ్లి సంబంధం కోసం వస్తున్నవారు చాలా షరతులు విధిస్తున్నారు. ముఖ్యంగా నటనను వదిలేయాలంటున్నారు. వివాహం కోసం నన్ను నేను మార్చుకోవడం ఇష్టం లేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top